పల్నాడులో 22 బార్లకు రీ-నోటిఫికేషన్

1887చూసినవారు
పల్నాడులో 22 బార్లకు రీ-నోటిఫికేషన్
పల్నాడు జిల్లాలో ఖాళీగా ఉన్న 22 బార్లకు రీ-నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె. మణికంఠ తెలిపారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు బుధవారం గెజిట్ విడుదలైనట్లు పేర్కొన్నారు. వీటిలో నరసరావుపేట-7, చిలకలూరిపేట-5, పిడుగురాళ్ల-4, మాచర్ల-3, వినుకొండలో 3 బార్లు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు బుధవారం సాయంత్రం నుంచి ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్