కేసనపల్లిలో నిలిచిన రోడ్డు పనులు: ప్రజల ఇక్కట్లు

2చూసినవారు
కేసనపల్లిలో నిలిచిన రోడ్డు పనులు: ప్రజల ఇక్కట్లు
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసనపల్లి గ్రామంలోని మహావీర స్కూల్ ఆపోజిట్ రోడ్డు నిర్మాణం పనులు కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయాయి. దీనివల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బైక్ ప్రయాణంలో ప్రమాదాలు జరగడం, వర్షపు నీటిలో పిల్లలతో నడిచేటప్పుడు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై గ్రామ పెద్దలు స్పందించి, నిలిచిపోయిన సిసి రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్