మొర్జంపాడులో రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీలు ప్రారంభం.. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

545చూసినవారు
గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాచవరం మండలం మొర్జంపాడు గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి 70 కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీలను ప్రారంభించారు. గురువారం ఆయన ముందుగా ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఒంగోలు జాతి పాల పండ్ల విభాగంలో ఎడ్ల జతలకు పోటీలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, క్రీడా కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.