గురజాల ఎమ్మెల్యే యరపతినేని చేతుల మీదుగా రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీల ప్రారంభం

307చూసినవారు
పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, మాచవరం మండలం మొర్జంపాడు గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి 70వ కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా, గురువారం రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీలను గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. ఆయన ముందుగా ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటిరోజు ఒంగోలు జాతి పాల పండ్ల విభాగంలో ఎడ్ల జతలకు పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, క్రీడా కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్