పల్నాడు జిల్లాలో రైతుల ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని వైర్లు, ఇతర సామగ్రి దొంగిలిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. దాచేపల్లి సీఐ రాజేష్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, బెల్లంకొండ మండలాల్లో రూ. 41 లక్షల విలువైన 42 ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ కేసులో నిందితులకు సహకరించిన మరికొందరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.