మాచవరం మండలం తురకపాలెం గ్రామంలో శనివారం తెల్లవారుజాము నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. మండల తెలుగు యువత అధ్యక్షులు అస్సాన్ వలి తెలిపిన వివరాల ప్రకారం, సచివాలయం సిబ్బంది బయోమెట్రిక్ ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు పంపిణీ కొనసాగుతుందని, మిగిలిన వారికి ఆదివారం కూడా పెన్షన్లు అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.