పిడుగురాళ్ల సమీపంలో ఆదివారం రాత్రి ఎంప్లాయ్ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి సుమారు 42-45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు నడికుడి రైల్వే పోలీస్ ఎస్‌ఐ పి. రమేష్‌బాబు (9849234990)ను సంప్రదించాలని పోలీసులు కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.