
మాచవరం: మళ్లీ రంగు మారుతున్న కృష్ణా నది నీళ్లు
తంగెడ, మట్టపల్లి కృష్ణా తీర ప్రాంతాల్లో నది నీరు నీలం రంగులోకి మారి, నాచుతో దుర్వాసన వెదజల్లడంతో అధికారులు తాగునీటి సరఫరాను నిలిపివేశారు. గతంలో సేకరించిన నమూనాల ఫలితాలు రాకపోవడంతో, కాలుష్య కారకాలను గుర్తించి ప్రజారోగ్యం దృష్ట్యా అధికారులు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.







































