మాచర్లలో 24 గంటల విద్యుత్ కాల్ సెంటర్ ఏర్పాటు

2చూసినవారు
మాచర్లలో 24 గంటల విద్యుత్ కాల్ సెంటర్ ఏర్పాటు
తుఫాను కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున, మాచర్ల డివిజన్ కార్యాలయంలో 24 గంటల ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. APCPDCL/CMD ఆదేశాల మేరకు, విద్యుత్ వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే దీని లక్ష్యం. విద్యుత్ స్తంభాలు విరిగిపోయినా, సర్వీస్ వైర్లు తెగిపోయినా, చెట్లు లైన్లపై పడినా, లేదా ఇతర విద్యుత్ సమస్యలు తలెత్తినా వెంటనే 9440817531 నంబర్‌కు కాల్ చేసి తెలపాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్. సింగయ్య గురువారం కోరారు. ఈ ఏర్పాటు పల్నాడు, మాచర్ల పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు వర్తిస్తుంది.

సంబంధిత పోస్ట్