ఆర్యవైశ్య సంఘం పేద కుటుంబానికి రూ. 10 వేల ఆర్థిక సాయం

277చూసినవారు
ఆర్యవైశ్య సంఘం పేద కుటుంబానికి రూ. 10 వేల ఆర్థిక సాయం
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నివసిస్తున్న గుత్తికొండ గ్రామానికి చెందిన పేద ఆర్యవైశ్యులు కొత్త శ్రీనివాసరావు కుటుంబానికి ఆర్యవైశ్య సంఘం సభ్యులు రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. కొత్త శ్రీనివాసరావు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న సంఘం సభ్యులు ఈ సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి అన్నప్రసాద కమిటీ ఫౌండర్ బవిరిశెట్టి రామారావు, మద్దు హనుమంతరావు, యువజన నాయకులు అశోక్, ఊటుకూరి రాము, ఆతుకూరి గోపి, సముద్రాల సాయి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్