గుంటూరు-మాచర్ల రహదారిపై రెడ్డిగూడెం వద్ద శనివారం ఆర్టీసీ బస్సు ఢీకొని ఆటో చోదకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మేడికొండూరు మండలం పాలడుగుకు చెందిన హరిబాబు తన స్నేహితుడి ఆటోలో పిడుగురాళ్ల వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుడిని 108 సిబ్బంది సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరుకు పంపారు. ఎస్సై మణికృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.