పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అసభ్య పదజాలం ఉపయోగించిన అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని కూటమి నాయకులు కారంపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును కారంపూడి ఎస్సై వాసు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.