మేకలు మేపుతుండగా పిడుగుపాటు.. రైతు దుర్మరణం

3735చూసినవారు
మేకలు మేపుతుండగా పిడుగుపాటు.. రైతు దుర్మరణం
పల్నాడు జిల్లా దుర్గి మండల కేంద్రంలో ఆదివారం రైతు చిన వెంకటేశ్వర్లు పిడుగుపాటుకు గురై మృతిచెందారు. మేకలను మేపేందుకు పొలాలకు వెళ్లిన ఆయన, అకస్మాత్తుగా కురిసిన వర్షానికి చెట్టు కింద ఆశ్రయం పొందారు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించారు. ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్