రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో అమరావతిలో ఈరోజు జరగనున్న నీటి సంఘాల సమావేశానికి కారంపూడి నుండి డిసీ చైర్మన్ పంగులూరి అంజయ్య నేతృత్వంలో రైతులు, నీటి సంఘాల సభ్యులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా తాహాసిల్దార్ వెంకటేశ్వర్లు నాయక్, పంగులూరి అంజయ్య జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ప్రభుత్వం రైతులు సమావేశానికి వెళ్లేందుకు ఉచితంగా బస్సులను కేటాయించిందని పంగులూరి అంజయ్య తెలిపారు.