మాచర్ల మండలంలోని కంభంపాడు సచివాలయంలో మాచర్ల తహశీల్దార్ కిరణ్ కుమార్ అధ్యక్షతన నీటి తీరువాపై గ్రామ ప్రజలకు, రైతులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా తహశీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, రైతులు సకాలంలో నీటి తీరువా చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. సాగునీటి వినియోగం, ప్రభుత్వ నిబంధనల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ అనిల్ కుమార్, వీఆర్వో అంజి, సచివాలయ సిబ్బంది, రైతులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.