మాచర్ల పట్టణంలోని 133 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికీలలు చెలరేగడంతో అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఫోమ్ వాటర్‌తో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో కొన్ని విద్యుత్ పరికరాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.