గ్రామ ఆరోగ్య దర్శినిలో తాసిల్దార్ కిరణ్ కుమార్ పాల్గొని సూచనలు

653చూసినవారు
గ్రామ ఆరోగ్య దర్శినిలో తాసిల్దార్ కిరణ్ కుమార్ పాల్గొని సూచనలు
గురువారం మాచర్ల మండలంలోని జమ్మలమడక గ్రామంలో నిర్వహించిన గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమంలో తాసిల్దార్ బి. కిరణ్ కుమార్ పాల్గొన్నారు. చిన్నారుల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని ఆయన సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, ఉపాధ్యాయులు విద్యార్థులపై శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. పల్నాడు కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.

సంబంధిత పోస్ట్