చారిత్రాత్మక సంపదను కాపాడాలి: ఎమ్మెల్యే

309చూసినవారు
చారిత్రాత్మక సంపదను కాపాడాలి: ఎమ్మెల్యే
మాచర్లలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఆదివారం జరిగిన ట్రస్టు బోర్డు సభ్యుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. చారిత్రాత్మక సంపదను భావితరాలకు అందించాలని, ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. సత్రశాల, ఎత్తిపోతల, చెన్నకేశవ స్వామి, కారంపూడి వీర్ల దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పరుగులు పెడుతోందని ఆయన పేర్కొన్నారు. కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధికి, ఆధ్యాత్మిక ప్రచారానికి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్