మాచర్ల పట్టణంలో లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజమండ్రి నుంచి వాటర్ బాటిళ్ల సరుకుతో వస్తున్న లారీ బైపాస్ నుంచి శ్రీశైలం రోడ్డుకు మళ్లే క్రమంలో డివైడర్ ఎక్కి రోడ్డుపైకి దూసుకెళ్లింది.ఈ ఘటనలో ఎదురుగా వస్తున్న మరో లారీతో ఢీ కొట్టడంతో పాటు డివైడర్‌పై ఉన్న విద్యుత్ స్తంభం, సిగ్నల్ లైట్లు ధ్వంసమయ్యాయి. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. పట్టణ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు