మాచవరం వైసీపీ సీనియర్ మహిళా నాయకురాలు, మాచవరం మండల కో-ఆప్షన్ సభ్యులు షేక్ జాన్ బి (65) శనివారం తుది శ్వాస విడిచారు. గతంలో మాచవరం వైసీపీ తరఫున ఎంపీటీసీగా పోటీ చేసిన ఆమె మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం పార్టీకి తీరని లోటు అని పలువురు అన్నారు.