మాచర్ల: కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా

1476చూసినవారు
మాచర్ల మండలం పోలేపల్లి అడ్డరోడ్డులో మంగళవారం ఉదయం కూలీలను తీసుకెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ దుర్ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 11 మందిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 అంబులెన్స్ సిబ్బంది మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఒకరిని నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్