ఆదివారం మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జులకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ట్రస్ట్ బోర్డు సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. దేవస్థాన అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. పల్నాటి ప్రజల ఆరాధ్య దైవమైన ఈ ఆలయ అభివృద్ధికి సమిష్టి కృషి అవసరమని ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.