మాచర్ల లోక్ అదాలత్ పై న్యాయవాదులతో సమావేశం

283చూసినవారు
మాచర్ల లోక్ అదాలత్ పై న్యాయవాదులతో సమావేశం
మాచర్ల ప్రధాన సివిల్ జడ్జి హాలులో, మండల న్యాయ సేవా కమిటీ చైర్మన్ ఎస్ శ్రీనివాస కళ్యాణ్ మాచర్ల న్యాయవాదులతో మార్చి 14, 2026న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ గురించి సమావేశమయ్యారు. ఈ లోక్ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కరించడానికి అందరూ సహకరించాలని శ్రీనివాస్ కళ్యాణ్ కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు వై. రమేష్ బాబు, శ్రీనివాసరావు, సీనియర్ న్యాయవాదులు రంగారావు, సత్యనారాయణ రెడ్డి, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్