పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలకలం.. ఇద్దరు మృతి

936చూసినవారు
పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలకలం.. ఇద్దరు మృతి
పాలనాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలకలం రేపుతోంది. రుద్రవరం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జ్యోతి, రాజుపాలెంకు చెందిన వృద్ధురాలు నాగమ్మ జ్వరంతో చికిత్స పొందుతూ 20 రోజుల క్రితం మృతి చెందారు. కొత్తూరుకు చెందిన మరో వృద్ధురాలు సాలమ్మ స్క్రబ్ టైఫస్ లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరణించిన వారి శాంపిల్స్ ను ముంబైకి పంపగా, స్క్రబ్ టైఫస్ తో మరణించినట్లు నివేదికలు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్