హోలీ వేడుకల్లో విషాదం: నీటిగుంటలో ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతు

1503చూసినవారు
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం బసికాపురం గ్రామంలో మంగళవారం హోలీ వేడుకలు విషాదంగా మారాయి. పండుగ సందర్భంగా నీటిగుంటలో ఈతకు వెళ్లిన నలుగురు స్నేహితులలో ముగ్గురు ఒడ్డుకు చేరుకోగా, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి గోపి నీటిలో మునిగి గల్లంతయ్యాడు. గోపి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్