యడ్లపాడు ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన ఆభరణాల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. తెనాలిలో మద్దుల రమణారావు అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. ఎస్సై శివరామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడి వద్ద నుంచి 216 గ్రాముల వెండి, 14 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కనుమర్లపూడిలో దాచిన చోరీ సొత్తును సీజ్ చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.