పిన్నెల్లి సోదరుల బెయిల్ కోసం వైసీపీ శ్రేణుల ప్రత్యేక పూజలు

620చూసినవారు
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డికి త్వరగా బెయిల్ మంజూరు కావాలని కోరుతూ పల్నాడు జిల్లా మాచర్లలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు, ప్రదక్షిణలు చేశాయి. 50 రోజులుగా నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న పిన్నెల్లి సోదరులు త్వరగా విడుదల కావాలని కాంక్షిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. 'గోవిందా.. గోవిందా', 'జై చెన్నకేశవ' అంటూ నినాదాలు చేశారు.
Job Suitcase

Jobs near you