
మంగళగిరి: ఎన్బీడబ్ల్యూ కేసులో నిందితుడుకి 14 రోజులు రిమాండ్
మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో జరిగిన డెకాయిట్ కేసులో నిందితుడైన కొప్పూరి ప్రభుదాస్ (26)ను పోలీసులు అరెస్ట్ చేశారు. రేవేంద్రపాడు సమీపంలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి చెవి కోసి బంగారం దోచుకున్న ఘటనలో ఇతను నిందితుడు. కోర్టుకు హాజరుకాకపోవడంతో అతనిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. గురువారం మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది.








































