మహంకాళీ అమ్మవారి హుండీకి రూ. 19. 77 లక్షల ఆదాయం

4857చూసినవారు
దుగ్గిరాల మండలం కేఆర్ కొండూరులోని శ్రీ మహంకాళీ అమ్మవారి ఆలయ హుండీలను సోమవారం లెక్కించగా రూ. 19,77,920 ఆదాయం వచ్చినట్లు ఈఓ సునీల్‌కుమార్ తెలిపారు. దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో అర్చకులు, స్వచ్ఛంద సేవకులు హుండీ లెక్కింపును పూర్తి చేశారు. భక్తులు సమర్పించిన కానుకలను పారదర్శకంగా లెక్కించి ఆలయ ఆదాయంగా నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్