మంగళగిరి: కోట్లాది ప్రజలు గర్వించదగ్గ సందర్భం

474చూసినవారు
మంగళగిరి: కోట్లాది ప్రజలు గర్వించదగ్గ సందర్భం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనే ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిందని, అమరావతి బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించడం గర్వించదగ్గ సందర్భమని మంత్రి లోకేష్ తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానానికి చట్టబద్ధత కల్పించే ఈ బిల్లు ఆమోదం పొందడం ఐదు కోట్ల ఆంధ్రుల విజయం, రైతుల త్యాగాలకు దక్కిన దైవ ఆశీస్సులు అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, మద్దతుగా నిలిచిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్