మంగళగిరి: 26 మంది చిన్నారులకు శిశు ఆధార్

1547చూసినవారు
మంగళగిరి: 26 మంది చిన్నారులకు శిశు ఆధార్
నగరంలోని రాజీవ్ గృహకల్ప రోడ్డు లియో కమ్యూనికేషన్స్ వద్ద ఆదివారం నిర్వహించిన ఉచిత శిశు ఆధార్ శిబిరానికి విశేష స్పందన లభించింది. మంగళగిరి పట్టణం, మండల పరిధిలోని గ్రామాలతో పాటు రాజధాని గ్రామాల నుంచి ప్రజలు తమ ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఆధార్ తీయించుకున్నారు. పలువురు తమ ఆధార్ తో ఫోన్ నంబర్లను లింక్ చేయించుకున్నారు. ఆధార్ సెంటర్ నిర్వాహకులు కుమ్మరి అనిల్ కుమార్ 26 మంది పిల్లలకు శిశు ఆధార్ నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్