మంగళగిరి: రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉండటం బాధగా ఉంది

898చూసినవారు
మంగళగిరి: రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉండటం బాధగా ఉంది
రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన చర్చలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్ తెలంగాణలోనే పుట్టి పెరిగినా, ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారని, అయితే వారి మనసులో తెలంగాణనే ఉందని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన అన్యాయం నుంచే జనసేన పార్టీ పుట్టిందని, నేతల మధ్య కాకుండా ప్రజల మధ్య ప్రాంతీయ, ఉపప్రాంతీయ విబేధాలు ఏర్పడటం బాధాకరమని, రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉండటం విచారకరమని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్