మంత్రి నారా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీలో అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు వైసీపీ అధినేత జగన్ బెంగళూరుకు వెళ్లిపోవడంపై విమర్శలు గుప్పించారు. జగన్ కు ఆత్మతో మాట్లాడే అలవాటు ఉందని, రాత్రి ఆత్మ చెప్పిందే ఉదయం మాట్లాడుతారని, ఎప్పుడు ఏ ఆత్మతో మాట్లాడి ఏం చెబుతాడోనని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయని ఎద్దేవా చేశారు.