మంగళగిరి: కూటమి స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం: వపన్

1160చూసినవారు
మంగళగిరి: కూటమి స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం: వపన్
తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, డిప్యూటీ సీఎం మరియు జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ, నాలుగు దశాబ్దాలుగా ప్రజాక్షేత్రంలో నిలదొక్కుకోవడంపై ఆయన ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అపార అనుభవంతో పార్టీని క్లిష్ట పరిస్థితుల నుండి గట్టెక్కించారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూటమితోనే సాధ్యమని, ఆ స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని పవన్ పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్