మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని ఎర్రబాలెంలో ఒక యువకుడు సెల్ ఫోన్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా ఒక వీడియో వైరల్ అవుతోంది. తన మరణానికి మంగళగిరి సీఐ వీరాస్వామి, డీఎస్పీ మురళీకృష్ణ కారణమని, తమపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆ యువకుడు ఆరోపించాడు. స్థానిక అధికార పార్టీకి చెందిన పెద్దలు పోలీసులకు చెప్పడం వల్లే తనపై కేసులు పెట్టారని, తన ఆవేదనను సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశాడు.