ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు విదేశీ విద్య నిధులు 90 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర జనసేన కార్యాలయం వద్ద బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రికి గతంలో అనేకమార్లు వినతి పత్రాలు ఇచ్చినా నిధులు విడుదల చేయలేదని, తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కాపు విదేశీవిద్యా దీవెన సంఘ అధ్యక్షులు శ్రీనివాసరావు తెలియజేశారు.