మంగళగిరి: నేడు ఆటో చోదకుల వివరాల నమోదు

631చూసినవారు
మంగళగిరి: నేడు ఆటో చోదకుల వివరాల నమోదు
మంగళగిరి గ్రామీణ పరిధిలోని ఆటోడ్రైవర్లకు ప్రత్యేక నంబర్లు కేటాయించి, క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ నమోదు చేయనున్నట్లు ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ మంగళవారం తెలిపారు. ప్రయాణికుల భద్రత, చోదకుల సంక్షేమం కోసం ఈ చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి మంగళగిరి సర్కిల్ కార్యాలయంలో నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఆటోడ్రైవర్లందరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్