మంగళగిరి: ఫేక్ పోస్టులు పెడితే కఠినచర్యలు

499చూసినవారు
మంగళగిరి: ఫేక్ పోస్టులు పెడితే కఠినచర్యలు
కుల, మత, ప్రాంతాల పేరుతో సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ అంశంపై చర్చించడానికి గూగుల్, మెటా, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ కంప్లయన్స్ ఆఫీసర్లను జీవోఎం సమావేశానికి పిలిపించాలని సూచించారు. సెక్షన్-46 ఐటీ యాక్ట్ ప్రకారం రాష్ట్రస్థాయి అడ్జుడికేటింగ్ ఆఫీసర్ నియామకంపై నోటిఫికేషన్ విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే వారిపై కూడా కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్