మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం విక్రయ కేంద్రాల యజమానులకు పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం, అన్ని మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు రాత్రి 10 గంటలకే తప్పనిసరిగా మూసివేయాలి. ప్రజాస్థలాల్లో, రోడ్ల వెంబడి బహిరంగ మద్యపానం పూర్తిగా నిషేధమని, బెల్టు షాపుల నిర్వహణ కూడా అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. రాత్రిపూట అక్రమ మద్యం అమ్మకాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.