ఆంధ్రప్రదేశ్ శరీరం అయితే హైదరాబాద్ గుండెకాయ అని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. తాను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనేనని, అక్కడి ప్రతి గల్లీ తనకు తెలుసని, హైదరాబాద్‌తో తనకు చాలా అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని తెలిపారు.