మంగళగిరి: గ్రహణం వీడింది.. దీపాల సెల్ఫీలు పెట్టండి: లోకేశ్

570చూసినవారు
మంగళగిరి: గ్రహణం వీడింది.. దీపాల సెల్ఫీలు పెట్టండి: లోకేశ్
అమరావతికి చట్టబద్ధత లభించిందని, ప్రజా రాజధానికి గ్రహణం వీడిందని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా నేటి సాయంత్రం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించి 'మన రాజధాని అమరావతి'కి దీపహారతులు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. వెలిగించిన దీపంతో సెల్ఫీ తీసుకుని, ఆ ఫొటోను #APThanksIndia హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్