వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రపై స్పష్టతనిచ్చారు. వచ్చే ఏడాది తన పాదయాత్ర ఉంటుందని, దాదాపు సంవత్సరన్నర పాటు ప్రజలతోనే గడుపుతానని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి వస్తానని ఆయన హామీ ఇచ్చారు. చంద్రబాబు తెచ్చిన ఎన్నికల మేనిఫెస్టో చెత్తబుట్టలో కలిసిపోయిందని, వైసీపీ శ్రేణులు చంద్రబాబుకు ప్రతిరోజూ సినిమా చూపిస్తాయని ఆయన విమర్శించారు.