తాడేపల్లి: రూపాయికి చాక్లెట్ రాదు.. ఏపీలో భూములు వస్తాయి

749చూసినవారు
తాడేపల్లి: రూపాయికి చాక్లెట్ రాదు.. ఏపీలో భూములు వస్తాయి
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ భూముల కబ్జాపై తీవ్ర విమర్శలు చేశారు. రూపాయికి చాక్లెట్ వస్తుందో లేదో తెలియదని, కానీ ఏపీలో రూపాయికి ఎకరాల భూములు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. రుషికొండ ఎదురుగా గీతం యూనివర్సిటీలో 52 ఎకరాల ప్రభుత్వ భూమిని రూ. 5 వేల కోట్లకు కబ్జా చేశారని, ప్రభుత్వ భూములను పప్పు బెల్లాల్లా కాజేస్తున్నారని పేర్కొన్నారు. చెన్నై, ముంబై, హైదరాబాద్‌లలో ఎస్ఎఫ్‌టీ రేటు రూ. 4 వేలు ఉండగా, అమరావతిలో రూ. 14 వేలు ఉందని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్