పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని ఎర్రబాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నూతన జెండాను ఆవిష్కరించింది. ఏపూరి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ జెండా ఆవిష్కరణతో పార్టీ కార్యకలాపాలకు కొత్త ఊపు వస్తుందని భావిస్తున్నారు.