పెదకాకానిలో వైభవంగా కనకదుర్గ అమ్మవారి ప్రతిష్ఠ మహోత్సవం

4991చూసినవారు
గుంటూరు జిల్లా పెదకాకానిలో కనకదుర్గ అమ్మవారి ప్రతిష్ఠ మహోత్సవం సోమవారం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, హోమాలు, వేద మంత్రోచ్చారణల మధ్య అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొన్నూరు ఎమ్మెల్యే దూల్లిపాళ్ళ నరేంద్ర ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడగా, మహోత్సవం విజయవంతంగా జరిగింది.

సంబంధిత పోస్ట్