శ్రీ సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు ఏడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం మంగళగిరిలోని
జనసేన పార్టీ కార్యాలయం వద్ద వారు ఆందోళన చేపట్టారు. 90 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నప్పటికీ తమకు జీతాలు చెల్లించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. టీఏడీపీ విధానాన్ని రద్దు చేసి, వేతనాలను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.