
పల్నాడు: పరిష్కారం కోసం వెళ్లి.. హత్యకు గురయ్యాడు
నరసరావుపేట (M) ములకలూరులో స్థల వివాదం కారణంగా పర్వతాలు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఆదివారం పొలం వద్ద జరిగిన ఈ ఘటనలో, తన సోదరుడి ఇంటి పక్కనే ఉండే వెంకటేశ్వర్లు వర్గం గడ్డపార, కర్రలతో దాడి చేయడంతో పర్వతాలు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



































