లాటరీ టికెట్ల వ్యాపారి శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలి: ప్రజల విజ్ఞప్తి

2559చూసినవారు
లాటరీ టికెట్ల వ్యాపారి శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలి: ప్రజల విజ్ఞప్తి
నరసరావుపేటలోని కుమ్మరి బజార్‌లో బహిరంగంగా షాపులు పెట్టి లాటరీ టికెట్లు విక్రయిస్తున్న వ్యాపారి శ్రీనివాసరెడ్డి (గుంటూరు రెడ్డి) పై చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున, ఏజెంట్ల ద్వారా టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయని, జిల్లా కేంద్రంలోనే ఇలా బహిరంగంగా షాపులు పెట్టి అమ్మకాలు చేస్తుంటే మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్