కస్తూర్బా బాలికా విద్యాలయంలో సీటు రద్దు: జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు

2535చూసినవారు
కస్తూర్బా బాలికా విద్యాలయంలో సీటు రద్దు: జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు
దాచేపల్లి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం అధికారులు తమ అనుమతి లేకుండానే సీటు అవసరం లేదని తప్పుడు లేఖ సృష్టించి, 6వ తరగతి సీటును రద్దు చేశారని తంగెడ గ్రామానికి చెందిన చాట్ల తేజ జిల్లా కలెక్టర్‌కు సోమవారం నాడు ఫిర్యాదు చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కుమార్తె విద్యా అవకాశం కోల్పోయిందని, ప్రభుత్వం చదివించే అవకాశం కల్పించలేకపోతే, తమ కుటుంబంతో కలిసి కూలీ పనులకు తీసుకెళ్లేందుకు అధికారిక అనుమతి ఇవ్వాలని వినూత్నంగా విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటన పల్నాడు, నరసరావుపేట ప్రాంతంలో చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్