కొండవీడు కోట మార్గంలో బిందు సేద్యం పద్ధతిలో సాగు చేస్తున్న గులాబి తోటను కలెక్టర్ కృతిక శుక్లా బుధవారం పరిశీలించారు. ఆధునిక సాగు విధానాలతో తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధిస్తున్న తీరును కలెక్టర్ ప్రశంసించారు. రైతులు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఖర్చులు తగ్గించి లాభాలు పొందుతున్నారని, నీటి సంరక్షణతో పాటు పంటల నాణ్యత మెరుగుపడుతుందని తెలిపారు.